మధులిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్.. భరత్‌ను ఉరి తీయాలి

242
- Advertisement -

హైదరాబాద్ లోని బర్కత్ పురాలో ప్రేమోన్మాది భరత్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని మధులిక యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పదిహేను రోజుల చికిత్స అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ చేశారు. మధులిక ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నుండి బయటికి వచ్చిన మధులిక మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమోన్మాది భరత్ కు కఠిన శిక్ష పడాలని కోరింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని తెలిపింది.

Madhulika

మధులిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. యశోద అసుపత్రి వైద్యులకు, మీడియా, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మధులిక ఆరోగ్య పరిస్థితి‌పై డాక్టర్స్ తమకు కౌన్సెలింగ్ ఇచ్చారని, శనివారం మరోసారి హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెప్పారని తండ్రి రాములు తెలిపారు. దాడికి పాల్పడిన భరత్‌ని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతనికి ఉరిశిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరాడు.

కాగా, మధులిక తనను ప్రేమించలేదని కసి పెంచుకున్న భరత్ ఈ నెల 6వ తేదీన ఆమెపై దాడి చేశాడు. కొబ్బరిబొండం కత్తితో ఆమెపై పదిహేనుసార్లు దాడి చేశాడు. మధులిక వైద్య చికిత్సల నిమిత్తం ఇప్పటి వరకూ పది లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షల సాయం అందింది.

- Advertisement -