ఎంపీ కవితను కలిసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

863
srinivas goud
- Advertisement -

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి కవితను ఆమె నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ను ఎంపీ కవిత అభినందించారు. సిఎం కేసిఆర్ కేబినేట్ లో పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరింత పేరు ప్రతిష్టలు తెస్తానన్నారు.

తనకు కేబినేట్ లో చోటు కల్పించిన సీఎం కేసీఆర్ కు, కృషిచేసిన ఎంపీ కవిత కు శ్రీనివాస గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

kavitha srinivas goud

- Advertisement -