కర్మ అనే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో అడవి శేష్. పవన్ పంజా సినిమాతో ఆకట్టుకున్న శేషు..రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలిలో భద్రగా మెప్పించాడు. రీసెంట్గా గూఢచారి సినిమాతో మెప్పించిన అడవి శేష్ ప్రేమలో పడ్డారు.
నాగార్జున మేనకోడలు సుప్రియను పెళ్లిచేసుకోనున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తలకు నిజం చేకూరేలా నా జీవితంలో ఓ అద్భుతం జరగబోతోంది.అదేంటో త్వరలో చెబుతాని అని ట్వీట్ చేశారు. దీంతో వీరి పెళ్లిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రంలో సుప్రియ స్పై అనే క్యారెక్టర్లో నటించింది. ఆ సమయంలో వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా చిగురించిందని చెబుతున్నారు.
ప్రస్తుతం వెంకట్ కుంచ దర్శకత్వంలో 2 స్టేట్స్ రీమేక్ చేస్తున్నాడు శేష్. రాజశేఖర్ తనయ శివాని ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌తో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో నటించింది సుప్రియా. ఆ చిత్రం తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న సుప్రియా అన్నపూర్ణ స్టుడియోస్ ప్రొడక్షన్ పనులుచూస్తోంది. వీరి పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలలో నిజమెంతో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.