ఐపీఎల్‌ 2019 షెడ్యూల్‌ ఖరారు..

248
IPL 2019
- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్ కు సంబందించిన షెడ్యూల్‌ ను బీసీసీఐ విడుదల చేసింది. క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే ఐపీఎల్ రంగం సిద్ధమైంది. మార్చి 23 నుంచి ఈ సీజన్ మొదలు కానుండగా.. ఏప్రిల్ 5 వరకూ మొత్తం 17 మ్యాచ్‌లకి సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు వచ్చిన తర్వాత.. దానికి అనుగుణంగా.. మొత్తం షెడ్యూల్‌ని ప్రకటించనున్నట్లు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ప్రతిసారీ ఫేవరెట్‌గా బరిలోకి దిగే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడతాయి. మార్చి 23, శనివారం సాయంత్రం చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. కేవలం రెండు వారాలకే షెడ్యూలను ప్రకటించడం గమనార్హం. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించే మ్యాచ్‌ల‌ వివరాలే ప్రకటించారు.

IPL 2019

రెండు వారాల వ్యవధిలో ఎనిమిది వేదికల్లో 17 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని జట్లు నాలుగు, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడతాయి. రెండు సొంత మైదానం, రెండు ఇతర మైదానాల్లో ఉంటాయి. దిల్లీ మాత్రం మూడు సొంత మైదానంలో, బెంగళూరు మూడు ఇతర మైదానాల్లో ఆడనున్నాయి.

1. మార్చి 23- చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(చెన్నై)

2. మార్చి 24- కోల్‌కతా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(కోల్‌కతా)

3. మార్చి 24-ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ కేపిటల్స్‌(ముంబై)

4. మార్చి 25- రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(జైపూర్‌)

5. మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌(ఢిల్లీ)

6. మార్చి 27-కోల్‌కతా నైట్‌రైడర్స్‌- కింగ్స్‌ పంజాబ్‌(కోల్‌కతా)

7. మార్చి 28-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌(బెంగళూరు)

8. మార్చి 29-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(హైదరాబాద్‌)

9. మార్చి 30- కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌(మొహాలీ)

10. మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(ఢిల్లీ)

11. మార్చి 31- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌)

12. మార్చి 31-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్తాన్‌ రాయల్స్‌(చెన్నై)

13. ఏప్రిల్‌ 1- కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ కేపిటల్స్‌(మొహాలీ)

14. ఏప్రిల్‌ 2- రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(జైపూర్‌)

15. ఏప్రిల్‌ 3-ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌(ముంబై)

16. ఏప్రిల్‌ 4- ఢిల్లీ కేపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఢిల్లీ)

17. ఏప్రిల్‌ 5- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-కోల్‌కతా నైట్‌రైడర్స్‌(బెంగళూరు)

- Advertisement -