షాకింగ్..జయరాం హత్య….వీడియో..!?

287
jayaram
- Advertisement -

ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు రాకేశ్‌ భూదందాలపై దృష్టిసారించారు. రియల్ ఎస్టేట్‌ పేరుతో వ్యాపారులను మోసం చేయడం,ఇళ్ల స్థలాలపై వివాదాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.కొంతమంది పోలీసు అధికారులు రాకేశ్‌కు సహకరించినట్లు నిర్దారణకు వచ్చారు.

రాకేశ్‌ పక్కా స్కెచ్‌తోనే జయరాంను హత్యచేశారని గుర్తించారు. హత్యకు ముందు నిందితుడు రాకేశ్‌ రెడ్డి ఒక వీడియోని తీసినట్లు విచారనలో తేలింది. ఖాళీ దస్తావేజులపై బలవంతంగా జయరాంతో సంతకాలు చేయించారు. చంపాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే నిందితుడు వీడియో తీయాలనే కుట్రకు తెర లేపాడని తేల్చారు.

దస్తావేజులను అడ్డం పెట్టుకుని జయరాంకు సంబంధించిన ఆస్తులపై న్యాయ వివాదాలు సృష్టించడం, కుటుంబసభ్యులను బెదిరించి వాటిని కాజేయడం అసలు ఉద్దేశమని దర్యాప్తు అధికారులు తేల్చారు. వీడియో చిత్రీకరణ సమయంలో ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన నగేశ్‌తోపాటు, విశాల్‌ అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత నగేశ్‌ అక్కడినుండి జారుకోగా..విశాల్‌ మాత్రం అక్కడే ఉండిపోయినట్లు విచారణలో వెల్లడైంది.త్వరలోనే జూబ్లీహిల్స్ పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టనున్నారు.

- Advertisement -