విజయ్ దేవరకొండ…చేసింది పది సినిమాలే అయినా అగ్ర హీరోల రేంజ్ పబ్లిసిటీ సంపాదించారు. పెళ్లిచూపులుతో హీరోగా మొదలైన విజయ్ సినీ ప్రయాణం అర్జున్ రెడ్డితో మారిపోయింది. టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలో తననటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న విజయ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎవరికి కష్టం వచ్చినా తానున్నానంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పూల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 50 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. జవాన్ల కుటుంబాల కోసం ‘భారత్ కే వీర్’ కింద ఆర్థిక సాయం అందించారు.
వారు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలి. సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేం. కానీ మనవంతు సహకారం అందిద్దాం. నా వంతు సహకారం అందించా. మనమంతా కలిసి సాయం చేద్దాం అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అయితే విజయ్ ఎంత విరాళాన్ని ఇచ్చారనేది మాత్రం తెలియనివ్వలేదు.
అర్జున్ రెడ్డి సినిమాలో నటనకు గాను తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు విజయ్. అంతేగాదు కేరళలో వరదలు సంభవించినప్పుడు తన వంతు సాయం అందించారు. తాజాగా జవాన్లకు అండగా నిలిచిన విజయ్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. విజయ్ రీల్ హీరోనే కాదు రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.
They protect our families.
We must stand by the families of our soldiers.No contribution can be substantial for our soldiers' lives, but we have to do our bit, I've done mine.
Together let's Contribute, together we will create a support system.https://t.co/pHp7ITOdit pic.twitter.com/G9ztDj0gvI
— Vijay Deverakonda (@TheDeverakonda) February 15, 2019