మాజీ కేంద్రమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత వాలెంటైన్స్ డేకి సరికొత్త అర్థం చెప్పారు. వాలంటైన్స్ డే సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఎవరైన బెదిరింపులకు పాల్పడితే వారి నుండి ఎలా తప్పించుకోవాలో చిట్కా ఇచ్చారు. వాలంటైన్స్ డే భారతీయ సంస్కృతిలో భాగమని దానినే తాము జరుపుకుంటున్నామని చెప్పాలని ట్వీట్ చేశారు.
Happy #ValentinesDay. If any Sangh Parivar trolls try to threaten you for being out with a friend, tell them you are celebrating the ancient Indian tradition of #KamadevaDivas ! https://t.co/US9D1unBwz
— Shashi Tharoor (@ShashiTharoor) February 14, 2019
ఇక ప్రేమికుల రోజుకి కామదేవ దివస్ అని పేరు పెట్టిన థరూర్ ఎవరైనా బెదిరిస్తే ఇది కామదేవ దివస్ అని చెప్పాల్సిందిగా సూచించారు. అంతేగాదు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోపికతో కూడిన పోటోను షేర్ చేశారు.
ఇక శశిథరూర్ ట్వీట్‌పై సెటైర్లు వేశారు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. శశిథరూర్‌ని లవ్ గురుగా అభివర్ణించిన నఖ్వీ..ఎవరైనా వాలంటైన్స్ డేని వ్యతిరేకిస్తే ఈ లవ్ గురు వారిని వ్యతిరేకిస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
MA Naqvi on S Tharoor's tweet 'If Sangh Parivar trolls try to threaten you for being out with a friend, tell them you're celebrating Indian tradition of Kamadeva Divas':Shashi Tharoor bhai toh Love Guru hain. Ab koi Valentine day ka virodh kare toh Love Guru to uska virodh karega pic.twitter.com/EwGl7aG3DR
— ANI (@ANI) February 14, 2019