జయరాం..శిఖా మధ్యలో శ్రీరెడ్డి..!

287
sri reddy
- Advertisement -

ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు నిందితుడు రాకేష్‌ రెడ్డిని మూడురోజుల కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసు కస్టడీలో రాకేష్ రెడ్డి కీలకవిషయాలను వెల్లడించగా మరోవైపు పోలీసు విచారణకు హాజరుకావాల్సిందిగా శిఖా చౌదరికి పోలీసులు నోటీసులు అందజేశారు.

ఈ నేపథ్యంలో శిఖా చౌదరికి అండగా నిలిచింది శ్రీరెడ్డి. ముఖానికి ముసుగుతో హైదరాబాద్‌లో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి ఫేస్ బుక్‌ వేదికగా శిఖాకు మద్దతు తెలిపింది. జయరాం హత్య కేసులో నిజా నిజాలు తెలుసుకోకుండా శిఖా చౌదరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు.. శిఖా చౌదరి ఈ మర్డర్ చేసిందని నేను నమ్మడం లేదు. ఈ కేసులో ఆమె అనుమానితురాలు కూడా కాదు అంటూ
పోస్ట్ చేసింది.

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో సంచలనం రేపిన శ్రీరెడ్డి కొంతకాలం క్రితం చెన్నైకి మకాం మార్చేసింది. అక్కడే ఇళ్లు తీసుకుని ఉంటున్న శ్రీరెడ్డి.. సడన్‌గా హైదరాబాద్‌లో దర్శనం ఇచ్చింది. అది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జయరాం మర్డర్ కేసులో కీలకంగా మారిన శిఖా చౌదరికి మద్దతు తెలుపుతు పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

sri reddy

- Advertisement -