అదిరిపోయే లుక్‌లో అనుష్క.. ఫోటో వైరల్‌

365
- Advertisement -

సూపర్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి అనుష్క శెట్టి. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్‌ అగ్ర హీరోలందరి సరసన నటించి.. స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ‘బాహుబలి’ సిరీస్ ద్వారా ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఈ స్వీటీ.. ఆ తర్వాత ‘భాగమతి’ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న అనుష్క.. ట్రీట్‌మెంట్ నిమిత్తమై అమెరికా వెళ్ళిందనే టాక్ వినిపించింది. కాగా తాజాగా ఈమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Anushka

‘సైజ్ జీరో’ సినిమా కోసం రిస్క్ తీసుకుని మరీ బరువు పెరిగిన స్వీటీ.. మళ్లీ పాత లుక్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. జీరో సైజ్ కోసం బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిన తర్వాత అనుష్క తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫొటో షూట్‌లో అనుష్క మునుపటి లుక్‌లో కనిపిస్తోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో..అందమైన బీచ్ తీరంలో అనుష్క ఫొటో షూట్‌కి సంబంధించిన స్టిల్స్‌ను షేర్ చేసుకున్నాడు.

- Advertisement -