పరీక్ష రాసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

324
MLA Jeevan Reddy
- Advertisement -

తెరాసా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విద్యార్థిగా మారిపోయారు. పరీక్షా కేంద్రంలో తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు. ఇదేంటి ఎమ్మెల్యే పరీక్ష రాయడం ఏంటని షాక్ అవుతున్నారా.. నిజమండీ బాబూ.. ఆయన పరీక్ష రాశారు. ఎమ్మెల్యేగా ఉన్నా చదువుపై ఉన్న శ్రద్ధతో దూరవిద్య ద్వారా ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నారు. ఆ పరీక్షలకే జీవన్ రెడ్డి హాజరయ్యారు.

MLA Jeevan Reddy

ఆర్మూర్ శాసన సభ్యులు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం హన్మకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఆయన ఎల్‌ఎల్‌ఎమ్ పరీక్ష రాశారు. ఆయన ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎమ్ దూరవిద్యను అభ్యసిస్తున్నారు. దీంతో ఎల్‌ఎల్‌ఎమ్ మూడో సెమిస్టర్ పరీక్షల కోసం హన్మకొండకు వెళ్లారు.

MLA Jeevan Reddy

ఇప్పటికే జీవన్ రెడ్డి ఎల్‌ఎల్‌ఎమ్ మొదటి సంవత్సరం పాస్ అయ్యారు. ఇప్పుడు రెండో సంవత్సరం చదువుతున్నారు. రెండు సంవత్సరాల కింద ఎల్‌ఎల్‌ఎం కోర్స్‌లో శిక్షణ పొందుతన్న ఆర్మూర్ ఎమ్మెల్యే గత ఏడాది రెండు సెమిస్టర్‌ల పరీక్షలు రాసి ఉత్తీర్ణతుడై ఈ రోజు 3వ సెమ్ యొక్క పరీక్షకు హాజరై పరీక్ష రాశాడు.

- Advertisement -