ఝాన్సీ ఆత్మహత్యకు రీజన్‌ చెప్పేసిన సూర్య..!

239
jhansi
- Advertisement -

సంచలనం రేపిన బుల్లితెర నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త కొణాలు వెలుగులోకి వచ్చాయి.ఝాన్సీ ప్రియుడు సూర్యతేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలకవిషయాలను రాబట్టారు. సినీ ఆఫర్లు లేకే ఝూన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసు విచారణలో వెల్లడించారు సూర్య. ఝాన్సీకి బాబీ , గిరిలు ఫొటో షూట్ చేసేవారిని వారి నమ్మొద్దని పలుమార్లు చెప్పానని చెప్పారు. గిరి సినిమా ఛాన్స్ పేరుతో ఝాన్సీని మోసం చేశాడని ఓసారి గిరికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపాడు సూర్య.దీంతో బాబి,గిరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

ప్రియుడు అనుమానిస్తుండటం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడం, సూర్యతేజకు వేరే సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

మధు అనే యువతి ద్వారా సూర్యతేజకు ఝాన్సీ పరిచయమైందని, వారిద్దరూ ప్రేమలో పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. కొద్దిరోజుల క్రితం ఝూన్సీతో గొడవపడిన సూర్యతేజ, ఆమె మొబైల్‌ నంబర్‌ ను బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టాడు. ఆపై ఝాన్సీ ఫోన్ చేసినా దానికి అతను స్పందించలేదు. ఆత్మహత్యకు రెండు రోజులముందు కూడా సూర్యతేజకు ఝాన్సీ ఫోన్ ట్రై చేసిందని పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

- Advertisement -