ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల పెళ్లిరోజు. నేటితో 14 సంవత్సరాలు పూర్తి చేసుకోగా.. ఈ సందర్భంగా మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.. తన ప్రియమైన భార్యతో కలిసి దిగిన ఫొటోను చేస్తూ.. ‘అందమైన జ్ఞాపకాలు. హ్యాపీ యానివర్సరీ మై లవ్’ అని మహేష్ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫొటోలో నమ్రత నవ్వుతుంటే.. మహేశ్ ఆమెను చూసి మురిసిపోతున్నట్లుగా ఉంది. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోను ఇప్పటివరకు రెండు లక్షల మందికిపైగా లైక్ చేశారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టాలీవడ్ డైరెక్టర్ బి.గోపాల్ తీసిన ‘వంశీ’ సినిమాలో నమ్రత తొలిసారి మహేశ్ కు పరిచయమయ్యారు. ఇది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగేళ్ల డేటింగ్ అనంతరం ఈ జంట 2005, ఫిబ్రవరి 10న ముంబైలోని మారియట్ హోటల్ లో పెళ్లి చేసుకుంది. అతడు షూటింగ్ సమయంలో మహేశ్ పెళ్లి జరిగింది. మహేశ్-నమ్రత దంపతులకు గౌతమ్ అనే కుమారుడు, సితార అనే కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం మహేశ్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘మహర్షి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.