హైదరాబాద్ లో మెట్రో రైలు ఎంతో మంది సమయాన్ని ఆధా చేస్తుంది. గంటలకొద్ది ట్రాఫిక్ లో వెయిట్ చేసే బుదులు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు భాగ్యనగర వాసులు. మెట్రో ట్రైన్ లో రోజుకి సుమారు లక్ష మందిని గమ్యస్ధానాలకు చేర్చుతుంది. వృద్దులు, వికలాంగుల కోసం స్టేషన్ల దగ్గర లిఫ్ట్‌లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జరిగిన సంఘటనలను చూస్తే ఈలిఫ్ట్ లను వృద్దుల కంటే ప్రేమికులే ఎక్కువగా ఉపయోగిస్తున్నారనిపిస్తుంది. నాలుగు వైపులా మూసుకుని ఉండే ఈ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్‌గా మారాయి. ఎక్కడా కొంతసేపు ఏకాంతం దొరుకుతుందా అని ఎదురుచూసే కొందరు కసి ప్రేమికులు… ఈ లిఫ్ట్‌లను తమ అవసరానికి వినియోగించుకుంటున్నారు.
తాజాగా ఈ లిఫ్ట్‌ల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ గమనించిన సిబ్బందికి… అందులో కనిపించిన దృశ్యాలు చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని తెలియక కొంత మంది జంటలు రెచ్చిపోయారు. కొందరు ముద్దులతో సరిపెట్టుకుంటే మరికొంత మంది ఏ భయం లేకుండా శృంగారం కూడా కానిచ్చేస్తున్నారు. దీంట్లో ఆశ్చర్యమేటిటంటే వీరంతా డిగ్రి చదివేవారేనట. ఇలా కొన్నిరోజులు పోతే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల కంటే… లిఫ్ట్ ఎక్కడం కోసం వెయిట్ చేసే లవర్స్ సంఖ్య పెరుగుతుందని భయం పట్టుకుంది మెట్రో సిబ్బందికి. తాజాగా లిఫ్ట్ సీసీ కెమెరాలు పరిశీలించిన సిబ్బంది పుటేజిని పోలీసులకు అందజేశారు. వృద్దులు, వికలాంగులు వాడాల్సిన లిఫ్ట్ లను యువతే ఎక్కువగా వాడటంతో మెట్రో సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.