ఇటివలే మాతృవియోగం చెందిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు సీఎం కేసీఆర్. ఈరోజు హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బాన్సువాడ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా స్పీకర్ స్వగ్రామమైన పోచారంలోని ఆయన నివాసానికి రోడ్డు మార్గంలో పోచారం గ్రామానికి వెళ్లారు చేరుకున్నారు.

ఈనెల 5 న స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తల్లీ పాపవ్వ (107సంవత్సరాలు) స్వర్గస్థులయిన విషయం తెలిసిందే. పోచారం తల్లి పాపవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎంపీ కవిత, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్ రెడ్డి తదితరులు స్పీకర్ పోచారంను పరామర్శించారు.


