సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. గత కొద్ది నెలల కిందట ఫేస్‌బుక్ ఈ ఫీచర్ గురించి ప్రకటించగా, ఇప్పుడిది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ మెసెంజర్‌లో యూజర్లు ఎవరైనా తాము అవతలి వారికి పంపిన మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేయవచ్చు. అయితే అందుకు గాను 10 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ లోపలే మెసేజ్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ లభిస్తున్నది.
దీనికోసం మీరు ఏం చేయాలంటే.. డిలిట్ చేయాలనుకున్న సందేశంపై లాంగ్ ప్రెస్ చేయాలి.అనంతరం రిమూవ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి..అందులో మళ్లీ రిమూవ్ ఫర్ ఎవ్రీవన్ ఎంపిక చేసుకోవాలి. ఇక మీ మెసెజ్ డిలిట్ అయినట్లే. అనంతరం మెసేజ్ డిలిట్ చేసినట్లు ‘‘యూ రిమూవ్డ్ ఏ మెసేజ్’’ అనే సందేశం సైతం మీకు చూపిస్తుంది. దీంతో మీ సందేశం శాశ్వతంగా తొలగించినట్లు మీరు ధ్రువీకరించుకోవచ్చు.