టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ప్రఖ్యాత ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో స్థానం సంపాదించి అందరి చూపును మరోసారి తనవైపు తిప్పుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే పాతికేళ్ళ వయసులో తన ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో ఐదు వందల రూపాయల మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన ఖాతాను బ్యాంక్ వారు బ్లాక్ చేశారని.. విజయ్ తెలిపారు. ఆ సమయంలో తన నాన్నగారు ’30 లోపే సెటిల్ అయితేనే సక్సెస్ ను ఎంజాయ్ చేయగలవని.. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సక్సెస్ సాధిస్తేనే నిజమైన విజయం’ అన్నారని.. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ’30 అండర్ 30′ లిస్టులో ఉన్నానని తెలిపాడు.
విజయ్ చేసిన ట్వీట్‌కు టీఆర్ఎస్ ఎంపీ కల్లకుంట్ల కవిత ఈరోజు ట్విట్టర్లో స్పందిస్తూ..‘ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు విజయ్. నీ ప్రయాణం ఇలాగే గొప్పగా సాగాలి. మీ నాన్నగారు నిర్దేశించిన లక్ష్యాన్ని నువ్వు అందుకున్నందుకు మరోసారి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల అంచనాలను అందుకోవడం పిల్లలకు కష్టమైన పని అని కవిత అభిప్రాయపడ్డారు.
Congratulations Vijay on making it to Forbes ‘30 Under 30’ 👍 great going !! Many more congratulations on meeting your Dad’s expectations .. that’s the toughest 😊 https://t.co/xLjRh1PCQs
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2019