త్రిష పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే..

427
- Advertisement -

చెన్నై బ్యూటీ త్రిష వ్యాపారవేత్త వరుణ్‌ మనియాన్‌తో నిశ్చితార్థం చేసుకుని చివరికి కొన్ని కారణాల వల్ల పెళ్లి విరమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి ఏడాదికిపైగా అవుతున్నా త్రిష ఎప్పుడూ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో ప్రస్తావించలేదు. అయితే ధనుష్‌, త్రిష జంటగా నటించిన ‘ధర్మయోగి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడారు. ‘ఈ విజయం నాకు చాలా అందించింది. గత రెండేళ్లుగా దీని కోసం నేను కష్టపడుతున్నాను. నాకు మరేవీ ప్లాన్స్‌ లేవు. సినిమా విజయం, అపజయం అనే విషయాలను పట్టించుకోకుండా నటిస్తాను’ అన్నారు.

online news portal

పెళ్లి తర్వాత నటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు త్రిష ఒక్క నిమిషం ఆగి సమాధానం ఇచ్చారు. ‘నా పెళ్లి ఆగిపోవడానికి కారణం అదే. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి.. వివాహం తర్వాత నటించొద్దని అడిగారు. దాంతో సినిమాలు కాదు, ఆ బంధాన్ని అక్కడితో ఆపేయాలని నిర్ణయించుకున్నా’ అన్నారు. ‘గర్భవతిని అయినప్పుడు మాత్రమే సినిమాల నుంచీ విరామం తీసుకుంటా. నాకు కథానాయికగా అవకాశాలు రాకపోతే.. సరిపోయే, నచ్చే పాత్రల్లో చేస్తా. కానీ చిత్ర పరిశ్రమ నుంచీ దూరంగా పోను. నా చివరి శ్వాస విడిచేవరకు నటించాలన్నదే నా కోరిక’ అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు త్రిష.

- Advertisement -