నాకేమ‌న్నా జ‌రిగితే మోదీదే బాధ్య‌తః అన్నా హాజారే

244
Anna-Hazare
- Advertisement -

ప్ర‌ముఖ గాంధేయ‌వాది, సామాజిక కార్య‌క‌ర్త అన్నా హాజారే మ‌రోసారి మోడీపై మండిప‌డ్డారు. . లోక్ పాల్, లోకాయుక్తల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై హాజారే మరోసారి దీక్ష చేపట్టారు. జనవరి 30వ తేదీన మహారాష్ట్రలోనలి రాలేగావ్ సిద్ధిలో దీక్షను ప్రారంభించారు హాజారే. సమస్యలపై పోరాడే శక్తి తనకు ఉందని, ఉద్యమంలో భాగంగా తనకేమైనా జరిగితే ప్రధాన మంత్రి మోదీయే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

anna-hazare

అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎంతో ఉపయోగ‌క‌ర‌మైన లోక్‌పాల్‌ బిల్లును అమల్లోకి తేవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. లోక్‌పాల్‌ అమల్లోకి వస్తే ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా విచారణ నుంచి తప్పించుకోలేరన్నారు. లోక్ పాల్ బిల్లు అమ‌లులోకి వ‌స్తే అవినీతి అంటే భయపడే పరిస్థితి వస్తుందని అన్నారు.

- Advertisement -