విహారయాత్రలా మమ్ముట్టి ‘యాత్ర’…

360
Mammootty speech at Yatra Pre Release
- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధానపాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం యాత్ర. ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు మహీ రాఘవ..వైఎస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ నచ్చుతుందని తెలిపారు.

సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత జగనన్నకు ట్రైలర్ చూపిస్తే బాగుందని అభినందించారు. సినిమా పూర్తయింది… ఒసారి చూస్తారా? అని అడిగాను. మీ నాయకుని కథ మీరు చెప్పారు… నేను చూసి ఏం చెప్పేది? అని జగన్ అన్నారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఓ స్ఫూర్తిని కలిగిస్తుందని హీరో సుధీర్ బాబు తెలిపారు.

చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని హీరో మమ్ముట్టి అన్నారు. తెలుగులో ఇంతకాలం సినిమాలు చేయకపోవడానికి బలమైన పాత్రలు దొరక్కపోవడమేనన్నారు. మహి వి.రాఘవ్‌ చెప్పిన కథ బాగా నచ్చిందని ఇది ఓ గొప్ప నాయకుడి పాత్ర అని..బయోపిక్‌ కాదన్నారు. నిజమైన సంఘటనలు, చరిత్ర ఇందులో లేకపోవచ్చు కానీ… పాదయాత్రలో వై.ఎస్‌ ఎవరెవరిని కలిశారు? వాళ్ల సమస్యల్ని ఎలా విన్నారు? వాటికి ఎలాంటి పరిష్కారం ఆలోచించారనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు. సినిమా షూటింగ్ మొత్తం విహారయాత్రలా సాగిందన్నారు.

- Advertisement -