అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్..

294
us telugu university
- Advertisement -

ఫేక్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం రిక్రూటర్స్‌గా వ్యవహరించిన 8 మంది తెలుగు వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు.మిచిగాన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్ టన్ ని ఫేక్ యూనివర్శిటీగా గుర్తించిన పోలీసులు ట్రంప్ ఆదేశాలతో చదువు పేరుతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న 600 మందిని నిర్భంధించారు.

ఈ యూనివర్శిటీలో 99శాతం మంది తెలుగు విద్యార్థులే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇమ్మిగ్రేషన్ మోసాలకు పాల్పడిన సామ సంతోష్ రెడ్డి, తక్కళ్లపల్లి అవినాష్, ఫణిదీప్, కాకారెడ్డి భరత్, సురేశ్ రెడ్డి కందాల, రాంపీస ప్రేమ్ కుమార్, నవీన్ పత్తిపాటి, అశ్వంత్ నూనె లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ది యూనిటివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్. ఈ వర్సిటీలో స్టాఫ్ లేరు. ఇన్‌స్ట్రక్టర్లు లేరు. అసలు ఈ యూనివర్సిటీకి ఒక కర్రిక్యులమే లేదు. క్లాసులు కూడా జరగవు. కానీ విద్యార్థులు మాత్రం 600 మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది నకిలీ ధ్రువపత్రాలతో అక్రమంగా వలసవచ్చి చేరినవారే.

తెలుగువారితో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌కు చెందిన చాలా మంది విద్యార్థులను ఫెడరల్ ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఫేక్ యూనివర్సిటీ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు.

- Advertisement -