తుదిదశ పంచాయతీ పోలింగ్‌..అప్ డేట్స్

213
polling
- Advertisement -

తెలంగాణ మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు.

తుది విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3,529 పంచాయతీల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.11,667 మంది సర్పంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. 27,583 వార్డుల్లో 67,316 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 32,055 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇక్కడ అన్ని పంచాయతీలు ఎస్టీకి రిజర్వు చేయబడ్డాయి. దీంతో ఎన్నికలు రోటేషన్ పద్దతిలో జరపాలంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో 25 పంచాయతీల్లో ఈసీ ఎన్నికలు నిలిపివేసింది.

- Advertisement -