ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కేబినెట్ విస్తరణ..!

236
kcr
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మంత్రివర్గవిస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. రానున్న లోక్‌ సభ,మండలి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం పావులు కదుపుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అంతేగాదు అసెంబ్లీ ఎన్నికల హామీలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో 16 స్ధానాల్లో విజయఢంకా మోగించవచ్చని కేసీఆర్ ఆలోచన. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురు లేదా ఎనమిది మందిని తీసుకోవచ్చని తెలుస్తోంది.

సామాజికవర్గాలు, జిల్లా సమీకరణలకు అనుగుణంగా తొలి విడత విస్తరణ జరపనున్నారు. తొలిమంత్రివర్గ విస్తరణలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పంట రుణాల మాఫీ, రైతుబంధు సాయం పెంపు, ఆసరా పెన్షన్ల వయోపరిమితి సడలింపు, ఆసరా పెన్షన్ల మొత్తం పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి కీలక అంశాలపై తొలి కేబినెట్‌ భేటీలోనే నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

ప్రజల డిమాండ్లకు అనుగుణంగా నారాయణపేట, ములుగు జిల్లాలతోపాటు కొత్తగా పలు రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది. ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా ఫిబ్రవరి సెకండ్‌ వీక్‌లో శాసనమండలి,మూడోవారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుండటంతో అంతకంటే ముందే మంత్రివర్గ విస్తరణ,ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించారు కేసీఆర్.

- Advertisement -