మహీ రికార్డును సమం చేసిన రోహిట్..

235
rohith
- Advertisement -

టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్‌తో పాటు రోహిత్ శర్మ ఒకరు.ఓపెనర్‌గా భారతజట్టుకు తిరుగులేని విజయాలను అందించిన రోహిత్ భారత్‌ తరపున మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తాజాగా మరో ఫీట్‌ని అందుకున్నాడు రోహిత్.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి భారత్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ తన ఇన్నింగ్స్‌లో రెండు సిక్స్‌లను బాదాడు. తద్వారా ఇప్పటివరకు భారత్ తరపున ఎక్కువ సిక్సులు బాదిన ఆటగాడిగా ఉన్న ధోని రికార్డును సమం చేశాడు.

ధోని 337 వన్డేల్లో 215 సిక్స్‌లు బాదగా రోహిత్ ఆ సిక్సుల రికార్డును సమం చేశాడు.వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో ధోనీ, రోహిత్‌ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్‌ టెండుల్కర్‌ 195 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాల్లో సౌరవ్‌ గంగూలీ (189 సిక్సులు), యువరాజ్‌ సింగ్‌ (153) ఉన్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేకు తొడ కండరాలు పట్టేయడంతో ధోని దూరమయ్యాడు. నాలుగో వన్డే జనవరి 31న, ఐదో వన్డే ఫిబ్రవరి 3న జరగనుంది. ఈ ఇద్దరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఈ వన్డేల్లో ఆడే అవకాశం ఉంది. దీంతో ఐదు మ్యాచుల వన్డే సిరీస్‌లో వరుసగా మూడు విజయాలు సాధించి, రెండు మ్యాచులు మిగిలి ఉండగానే భారత్ ఈ సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి
తెలిసిందే.

- Advertisement -