ఎన్టీఆర్ బయోపిక్‌పై తనదైన శైలీలో స్పందించారు దర్శకుడు తేజ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని అందుకే ఎన్టీఆర్ బయోపిక్ చూసే సమయం లేదన్నారు. సినిమా చూసుంటే కచ్చితంగా మాట్లాడేవాడిని తెలిపారు. సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా అని ప్రశ్నించగా అది దర్శకుడిపై ఆధారపడి ఉంటుఉందని ఆయనే తన పనితనాన్ని చూపించాలన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్‌ని తొలుత తేజ దర్శకత్వంలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత అనుకొని కారణాల వల్ల తేజ ఆ బయోపిక్ నుండి వైదొలిగారు. తాజాగా తనదైశ శైలీలో బయోపిక్ గురించి స్పందించారు.
రెండు పార్టులుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్టు కథానాయకుడు సంక్రాంతి కానుకంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వసూళ్లలో మాత్రం జోరును చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో సెకండ్ పార్టులో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసి ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు.
ఈ బయోపిక్‌లో బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మేనన్ నటించారు.