కంగనాతో సినిమా తీసే ప్రసక్తేలేదు:క్రిష్‌

290
krish kangana
- Advertisement -

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం మణికర్ణిక. శుక్రవారం(జనవరి 25న) ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు క్రిష్,కంగనాకు మధ్య విభేదాలు వచ్చి క్రిష్ పక్కకు తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ న్యూస్‌ ఛానల్‌తో ఆసక్తికర విషయాలు వెల్లడించారు క్రిష్.

భవిష్యత్‌లో తాను కంగనాతో సినిమా చేసే ప్రసక్తే లేదని తెల్చిచెప్పారు. తన గురించి కంగన చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. తాను తెరకెక్కించిన చిత్రం బంగారంలా ఉందని కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది వెండిలా ఉందన్నారు. ఏదిఏమైనా సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నానని తెలిపారు.

దర్శకుడిగా సినిమా చక్కగా రావాలని భావించి నేను కొన్ని రోజులు ఝాన్సీ ప్రాంతంలో నివసించాను. లక్ష్మీబాయి విశ్వవిద్యాలయంలో చదువుతున్న వారిలో దాదాపు 40 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశాను. చరిత్రలో ఉన్న నిజాలను చూపించాలని నేను ఇంతగా తాపత్రయ పడితే.. కంగన చరిత్రను విస్మరించాలని చూశారని ఆరోపించారు.

అతుల్‌ కులకర్ణి చేసిన యుద్ధ సన్నివేశాలు తొలగించేశారు. ఈ సన్నివేశం సినిమాలో ఉండాలని అనుకున్నాను. కానీ కంగన సన్నివేశాలు తొలగిద్దామని అడిగితే నేను ఒప్పుకోలేదు. తాను సినిమా కోసం 400 రోజులు కేటాయించాను.కానీ తాను చేసింది తప్పు అంటే బాధ కలిగించదా అన్నారు.

- Advertisement -