ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంచుకుంటూ వెళ్తుంది. ఇటివలే ఆమె చేసిన హ్యాపి వెడ్డింగ్ మూవీ కూడా అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆమె సూర్యకాంతం అనే సినిమాలో నటిస్తుంది. ప్రణిత్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమూవీలో నిహారిక కు జోడిగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు.
రొమాంటిక్ కామెడీ ఎంటటైనర్ గా రూపొందుతున్న ఈచిత్ర టీజర్ ను ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. సందీప్ ఎర్రమ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈసినిమాతోనైనా నిహారికి హిట్ కొడుతుందో లేదో చూడాలి మరి.