సినీనటి భానుప్రియపై పోలీసు కేసు..

217
- Advertisement -

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏడాది క్రితం 14 ఏళ్ల సంధ్య అనే తన కుమార్తెను చెన్నైలో ఉన్న భానుప్రియ ఇంట్లో పనికి పంపించామని… అప్పటి నుంచి తన కూతురును చిత్రహింసలు పెడుతున్నారని సామర్లకోట మండలానికి చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Actress Bhanupriya

ఇదివరకు తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడించేవారని.. కానీ ఏడాది కాలంగా తన కుమార్తెతో ఫోన్‌లో కూడా మాట్లాడించడం లేదని పేర్కొన్నారు. తన కుమార్తెతో మాట్లాడించాలని కోరిన పట్టించుకోవడం లేదని.. పైగా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు.

పది లక్షల రూపాయలు చెల్లించి తన కుమార్తెను తీసుకెళ్లాలని భానుప్రియ చెబుతున్నట్టు తెలిపారు. దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -