బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన దర్శకుడు రాజమౌళి. లాంగ్ గ్యాప్ తర్వాత బాహుబలి మరో మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకువస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ ( వర్కింగ్ టైటిల్ )తో తెరకెక్కుతుండగా రీసెంట్గా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ఈ మూవీ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నట్టు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తెలియజేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని .. చెర్రీకి బాబాయ్ గా నటించనున్నాడని టాక్. అయితే పాత్ర ఏంటనే దానిపై క్లారిటీ రావలసి ఉందట. కోలీవుడ్ లో ఫేమస్ అయిన ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఈ చిత్రంతో తెలుగులోకి స్ట్రైయిట్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
కథానాయికలుగా కీర్తి సురేష్, రష్మిక మందన్నా నటిస్తున్నారని ఆ మధ్య వార్తలు రాగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది.