నేపియర్ వేదకిగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలివన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. ఫ్లాట్ ట్రాక్‌పై టీమిండియా పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా పేస్ బౌలర్ షమీ అద్భుత బౌలింగ్‌తో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(5), కొలిన్ మున్రో(8)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చి షమీ 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. తద్వార అంతర్జాతీయ వన్డేల్లో అతి వేగంగా 100 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.
ఇప్పటి వరకు ఇర్ఫాన్ పఠాన్ (59 వన్డేలు ) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. జహీర్ ఖాన్ 65 వన్డేల్లో ఈ ఘనతను అందుకోగా.. అజిత్ అగార్కర్ 67 వన్డేల్లో, జవగల్ శ్రీనాథ్ (68 వన్డేల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకున్నారు.
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమన్స్ 964) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ప్రస్తుతం 33 ఓవర్లు ఆడిన కివీస్ 7 వికెట్లకు 146 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు భారత బౌలర్లు వైవిధ్యమైన బంతులతో చుక్కలు చూపించారు. భారత బౌలర్లలో షమీ (3),చాహల్(2),కుల్దీప్,కేదార్ జాదవ్ తలో ఒక వికెట్ తీశారు.
Shami on fire 🔥🔥🔥#TeamIndia #NZvIND pic.twitter.com/NHBnPOH19l
— BCCI (@BCCI) January 23, 2019