తెలంగాణ పంట పండింది..

555
rice telangana
- Advertisement -

తెలంగాణ పంట పండింది. అన్నపూర్ణగా అవతరించింది. సరైన సాగునీటి యాజమాన్య పద్ధతులు, రైతుల్లో పెరిగిన అవగాహన, స్వల్పకాలంలోనే దిగుబడినిచ్చే నవీన వంగడాల వినియోగం, రైతుబంధు, నిరంతర విద్యుత్ వెరసీ తెలంగాణను అన్నపూర్ణగా మార్చేలా వరి దిగుబడి భారీగా పెరిగింది. 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా పంట చేతికి వచ్చింది.

ఈ వానకాలంలో 61 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. గత వానకాలం పంట దిగుబడితో పోల్చితే రెట్టింపు. అంతేగాదు 20 ఏండ్ల కాలవ్యవధిలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎకరాకు 20 క్వింటాళ్లపైనే వరి దిగుబడి వచ్చింది.

2013-14 ఖరీఫ్ లో 56 లక్షల 56 వేల టన్నుల వరి దిగుబడి వచ్చిందని…. అప్పటితో పోలిస్తే 4లక్షల 44 వేల టన్నులు అదనంగా దిగుబడి సాధించినట్లు అధికారులు తెలిపారు. దిగుబడినిచ్చే కొత్త వరి వంగడాలను రాయితీపై రైతులకు ఇవ్వటం…తెలంగాణ సోనా, కూనారం సన్నాలు విత్తనాలను అధికంగా వాడటం.. విత్తనం మార్పిడి, ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవటంతో తెగుళ్ల బెడద తప్పినట్లు తెలిపింది.

జులైలో 30% లోటు నమోదైనా.. ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలు, చెరువుల్లో సాధారణ నీటి వనరులు ఉండి.. అనుకున్న దానికంటే అధికంగా వరిని ఆదుకున్నాయి. ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది.

- Advertisement -