టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక ఐసీసీ మూడు అత్యున్నత అవార్డులు గెలిచిన తొలి ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లి గెలుచుకున్నాడు.
ఐసీసీ టెస్ట్,వన్డే జట్టులకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు విరాట్. ఐసీసీ వన్డే టీమ్‌లో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా చోటు సంపాదించారు.
టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లితోపాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. 2018లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఐసీసీ టెస్టు జట్టులో చోటు కల్పించింది.
ఐసీసీ టెస్టు జట్టు: టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, హెన్రీ నికోలస్(న్యూజిలాండ్), కరుణరత్నే (శ్రీలంక), కగిసో రబడా(దక్షిణాఫ్రికా), నాథన్ లియోన్(ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), మహ్మద్ అబ్బాస్(పాకిస్తాన్)
ఐసీసీ వన్డే జట్టు: రోహిత్,కోహ్లీ,కుల్దీప్,బుమ్రా(భారత్),బెయిర్ స్ట్రా,జోరూట్,బెన్ స్టోక్స్,జోస్ బట్లర్(ఇంగ్లాండ్),రాస్ టేలర్(న్యూజిలాండ్),ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్),రషీద్ ఖాన్(అఫ్ఘనిస్తాన్).
Presenting the ICC Men's ODI Team of the Year 2018! 🏆
🇮🇳 @ImRo45
🏴 @jbairstow21
🇮🇳 @imVkohli (c)
🏴 @root66
🇳🇿 @RossLTaylor
🏴 @josbuttler (wk)
🏴 @benstokes38
🇧🇩 @Mustafiz90
🇦🇫 @rashidkhan_19
🇮🇳 @imkuldeep18
🇮🇳 @Jaspritbumrah93➡️ https://t.co/EaCjC7szqs#ICCAwards 🏆 pic.twitter.com/dg64VGuXiZ
— ICC (@ICC) January 22, 2019