‘మహాత్మాగాంధీ’ నా తండ్రి.. సారీ చెప్పిన సారా..

300
Sara Ali Khan
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ కెరీర్ తొలినాళ్లలోనే వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. ఆమె తొలి చిత్రం కేదార్‌నాథ్ మంచి విజయాన్ని అందుకోగా.. ఇటీవల రణ్‌వీర్ సింగ్ సరసన రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సింబా’ చిత్రం రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది.

Sara Ali Khan

ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో గూగుల్‌లో తన గురించి వెతికిన ప్రశ్నలపై సారా స్పందించారు. ‘సారా తండ్రి ఎవరు’ అని గూగుల్‌లో వెతికిన ప్రశ్నకు … ‘మహాత్మా గాంధీ’ అని ఆమె చమత్కరించారు. ఆ తర్వాత సరైన సమాధానం చెబుతూ.. ‘సారీ.. ఈ విషయంలో జోకులు వేయకూడదు. నా తండ్రి సైఫ్‌ అలీ ఖాన్‌’ అన్నారు. ‘సారా పటౌడీ వంశానికి రాకుమారా?’ అని కూడా గూగుల్‌లో వెతికారు. ఇందుకు సారా.. ‘రాజుల పాలన ఇప్పుడు లేదు. నేను అందరిలా సాధారణ అమ్మాయినే’ అని సమాధానమిచ్చారు.

- Advertisement -