- Advertisement -
సినీ సెలెబ్రెటీలకు వారి వద్ద పనిచేసే సిబ్బంది మధ్య మంచి అనుబంధం ఉంటుందనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది. తమ వద్ద పనిచేసే వారి ఇంట్లో ఎలాంటి కార్యం జరిగినా చాలా మంది హీరో, హీరోయిన్లు, నటీనటులు వారికి సంతోషంలో భాగం పంచుకొంటారు. ఇక ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ తమ దగ్గర పనిచేసే స్టాఫ్‌ని బాగా చూసుకుంటారు.
అసలు విషయం ఏంటంటే..అఖిల్ అక్కినేని పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ వివాహానికి అఖిల్ అక్కినేని స్వయంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -