భారత్ టార్గెట్ 299..

237
- Advertisement -

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. భారత్‌ ముందు 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షాన్ మార్ష్(131: 123 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు. హార్డ్‌హిట్టర్ మాక్స్‌వెల్(48: 37 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్) కీలక సమయంలో రాణించాడు.

Australia vs India

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(4/45), మహ్మద్ షమీ(3/58) మినహా అందరూ తేలిపోయారు. వీరిద్దరు మాత్రమే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టారు. వన్డేల్లోకి అరంగేట్రం చేసిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. 10 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నాడు. జ‌డేజా క‌ళ్లు చెదిరే ర‌నౌట్ చేయ‌డంతో పాటు ఒక వికెట్ తీశాడు.

ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 15 పరుగుల తేడాతో ఆసీస్‌ చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. స్టాయినిస్‌ 29, ఖవాజా 21, హ్యాండ్స్‌కాంబ్‌ 20, కారే 18, నాథన్‌ లైయన్‌ 12, ఫించ్‌ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 4, షమీ 3 వికెట్లు తీయగా.. జడేజా 1 వికెట్‌ పడగొట్టాడు.

- Advertisement -