నెటిజన్లను ఫిదా చేసిన సితార..

262
sitara mahesh babu
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార నెటిజన్లను ఫిదా చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాల గురించి తక్కువగా మాట్లాడే మహేష్ తన కుమార్తె సితార వీడియోను షేర్‌ చేశారు. సోదరుడు గౌతమ్‌ ఫ్యామిలీ గాయ్ అని పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో ఆరేళ్ల సితార ఇంగ్లిష్‌లో మాట్లాడే తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తన సోదరుడు గౌతమ్‌ ఇప్పటి వరకు ఒంటరిగా ట్రిప్‌కు వెళ్లలేదని, అతడు ఫ్యామిలీ గాయ్‌ అని సితార అంటోంది.

మహేశ్‌ షేర్‌ చేసిన వీడియోను కేవలం 15 గంటల్లో ఆరు లక్షల మంది చూశారు. దాదాపు 1600 మంది కామెంట్లు చేశారు. దుబాయ్‌లో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్‌ ఫ్యామిలీ అక్కడే నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంది.

మహేశ్‌ నటిస్తున్న ‘మహర్షి’ ఏప్రిల్‌లో విడుదల కానుండగా వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్‌.

- Advertisement -