- Advertisement -
ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరి ఏమైందో ఏమోగానీ చాలా ఆవేదనతో తన ట్వీటర్లో ఒక పోస్ట్ చేసింది. మనషుల్లో మానవత్వం చచ్చిపోతోందంటూ ఫీలయింది. అసలు ఆమె ఆ ట్వీట్ చేయడానికి కారణమేంటో తెలియదు కానీ బాగా హర్ట్ అయి ట్వీట్ చేసినట్టు మాత్రం తెలుస్తుంది. సమాజంలో మానవత్వం మంటకలిసి పోతోందంటూ ఆవేదన భరితంగా ట్వీట్ చేసింది.
‘మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా? అని గతంలో నన్ను చాలా మంది అడిగారు. కానీ వారి అభిప్రాయంతో అప్పుడు నేను ఏకీభవించలేదు. కానీ, ఇప్పుడు నాకు అనుభవమైంది. మనం కలసి ఉండటానికి, కలసి జీవించడానికి డబ్బే కారణం అనిపిస్తోంది. జనాల్లోని మానవత్వం మొత్తం నశించేలోపు… ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా’ అంటూ ట్వీట్ చేసింది.
— SreeMukhi (@MukhiSree) January 3, 2019
- Advertisement -