- Advertisement -
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కూకట్పల్లిలో టీఆర్ఎస్ విజయోత్సవ సభలో మాట్లాడిన కేటీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్మచేయమన్నారు. టీఆర్ఎస్,సీఎం కేసీఆర్పై నమ్మకంతో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు.
ఓటరు నమోదులో పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడం వల్లే ప్రజాప్రతినిధుల మెజార్టీ తగ్గింది. కావున ఇప్పుడు జరిగే ఓటర్ల నమోదు ప్రక్రియలో కార్యకర్తలు, నాయకులు చురుగ్గా పాల్గొని ఓటర్లను నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్ర ప్రాంత వాసులకిచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు అద్భుతంగా పని చేశారని కొనియాడారు. యావత్ తెలంగాణ సమాజం సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని ఆమోదించిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ పని చేస్తోందని కెటిఆర్ తెలిపారు.
- Advertisement -