నేను ప్రేమలో పడ్డా:సాయి పల్లవి

239
Sai Pallavi
- Advertisement -

ఫిదా చిత్రంతో యువకుల మనసు దోచుకున్న హీరోయిన్‌ సాయిపల్లవి. మలయాళంలో నటించిన మొదటి సినిమా ప్రేమమ్‌తో అక్కడి ప్రజల ప్రేమాభిమానాలను పొందిన సాయిపల్లవి ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్‌లో హాట్ భామగా మారింది. ఇటీవల పడిపడి లేచే మనసుతో హిట్ కొట్టిన ఈ మలార్ బ్యూటీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సహజీవనం వ్యక్తిగత అంశమని నటిగా మారాక నటనను ప్రేమిస్తున్నానని తెలిపింది. అయితే తాను కోరుకునేది వైవాహిక జీవితాన్నే అని వెల్లడించింది. తాను చదువుకునే రోజుల్లో పుస్తకాలతో ప్రేమలో పడ్డానని, నటిగా మారాక నటనను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేస్తే తప్పేమీ లేదని వెల్లడించింది. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఎవరితోనైనా కలిసుంటున్నారా? వంటి ప్రశ్నలు ఇటీవలి కాలంలో తనకు ఎక్కువయ్యాయని, తనకు లివింగ్ టుగెదర్ సంబంధంపై నమ్మకం లేదని చెప్పింది.

- Advertisement -