ట్యాక్స్ చెల్లింపుపై స్పందించిన మహేష్‌ లీగల్‌ టీమ్‌..

265
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు జీఎస్టీ పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలంటూ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. మహేష్‌ బ్యాంకు అకౌంట్స్‌ని కూడా అటాచ్ చేశారు. ఈ నోటీసులపై మహేష్ బాబు లీగల్ టీమ్ తాజాగా స్పందించింది. మహేష్‌ చట్టానికి కట్టుబడి తన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారని ఆయన లీగల్‌ టీమ్‌ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

దీనిపై మహేష్‌ బృందం స్పందిస్తూ..‘జీఎస్టీ కమిషనరేట్‌, హైదరాబాద్‌ వారు కోర్టు పరిధిలో ఉన్న రూ.18.5 లక్షల పన్నుని వడ్డీతో కలిపి రూ.73.5 లక్షలు నిర్ణయించి బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించారు. 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను అంబాసిడర్‌ సర్వీసెస్‌కు ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్‌ సర్వీసెస్‌ ఎటువంటి పన్ను పరిధిలోకి రాదు.

Mahesh Babu

అంబాసిడర్‌ సర్వీసెస్‌ని పన్ను పరిధిలోకి సెక్షన్‌ 65 (105) ద్వారా 01-07-2010 నుంచి చేర్చారు. పన్ను చెల్లించే వ్యక్తి చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా పైగా ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్‌ బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించారు. మహేష్‌ బాబు చట్టానికి కట్టుబడే పౌరుడిగా తన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారు’ అంటూ మహేష్ లీగల్‌ టీమ్‌ వివరణ ఇచ్చింది.

- Advertisement -