మహేష్‌కి షాకిచ్చిన జీఎస్టీ అధికారులు..

322
mahesh babu
- Advertisement -

టాలీవుడ్ ప్రిన్స్‌ సూపర్ స్టార్ మహేష్‌ బాబుకి జీఎస్టీ అధికారులు షాకిచ్చారు. ట్యాక్స్ కట్టకపోవడంతో మహేష్ బ్యాంక్ అకౌంట్స్‌ని సీజ్ చేశారు.2007-08లో మహేష్ బాబు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఎలాంటి సర్వీస్ ట్యాక్స్‌ పే చేయలేదు. రూ.18.5లక్షలు బకాయి పడ్డారు.

మొత్తం రూ.18.5లక్షల పన్నుకు వడ్డీతో కలిపి రూ.73.5 లక్షలు చెల్లించాల్సి ఉండగా పదేళ్లుగా కట్టకపోవడంతో హైదరాబాద్ జీఎస్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. మహేష్‌కి చెందిన యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్స్‌‌ను సీజ్ చేసింది. సర్వీస్ ట్యాక్స్ కట్టనందునే రెండు బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశామని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరి దీనిపై మహేష్‌ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

ప్రస్తుతం మహేష్‌ బాబు-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -