జీఎస్టీతో కుదేలైన పతంజలి

405
pathanjali
- Advertisement -

దేశీయ మార్కెట్‌లో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న సంస్ధ పతంజలి. తక్కువ టైంలోనే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పతంజలి సంస్థలు వెలిశాయి. తొలుత ఆయుర్వేదిక్ బ్రాండ్లతో ఎంట్రీ ఇచ్చిన బాబా రాందేవ్ తర్వాత వంట సామాన్ల దగ్గరి నుంచి కాస్మోటిక్ వస్తువులను సైతం తయారుచేసి మార్కెట్ లో తనపట్టును సాధించుకుంది. త్వరలో పతంజలి జీన్స్‌ను తీసుకొస్తామని ప్రకటించిన ఈ సంస్థ ప్రస్తుతం 500 రకలా ఉత్పత్తులతో ప్రధాన కంపెనీలకు గట్టిపోటినిస్తోంది.

అయితే మోడీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీతో పతంజలికి మొట్టమొదటిసారిగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ కంపెనీలు పోటీగా నిలవడంతో అమ్మకాల్లో వెనకబడింది పతంజలి. సీఏఆర్ఈ నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈఏడాది వెయ్యికోట్ల రూపాయలు కోల్పోయింది.

పతంజలి కంపెనీ 2016-17లో రూ.9030 కోట్లు అమ్మకాలు సాధించగా,2017-18లో రూ.8135కోట్లుకు పడిపోయింది. లాభాల్లోనూ పతంజలి వెనుకబాటులోనే ఉంది. గతంలో లాభాలు రూ.1190 కోట్లు ఉండగా.. ఈ ఏడాది సగానికి సగం పడిపోయి రూ.529 కోట్లకు చేరింది.

- Advertisement -