డి.వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యస్వంత్ మూవీస్ ప్రెసెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘తారామణి’ .తమిళంలో చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది. అదేపేరుతో తెలుగులోతారమమణిగా ప్రేక్షకుల ముందుకురానుంది. హీరోయిన్స్ ఆండ్రియా, అంజలి ప్రధాన పాత్రధారులుగా వసంత్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.
ఎ సర్టిఫికెట్ పొంది జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా జనవరి1న సినిమా విడుదల కానుందని తెలిపారు. తప్పనిసరిగా చూడండి అంటూ విడుదల చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.
ఈ సందర్బంగా నిర్మాత డి వెంకటేష్ మాట్లాడుతూ తమిళంలో తారామణి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది. నేటి యువత ప్రవర్తనకు అద్దం పట్టేలా ఈ చిత్ర కథాంశం ఉండడం తో ప్రేక్షకులు బాగా ఆదరించారు. అందుకే ఇంతమంచి మెసేజ్ ఉన్న తారామణి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని చెప్పారు.