నా గర్భంలో దేవుడున్నాడు…

237
Teen Says She’s Pregnant With Baby Jesus
- Advertisement -

తన గర్భంలో జీసస్‌ ఉన్నాడని ఓ 19 ఏండ్ల యువతి సంచలన ప్రకటన చేసింది. త్వరలోనే తాను దేవుడికి జన్మనిస్తున్నట్లు వెల్లడించింది. అయితే డాక్టర్లు మాత్రం హాలె గర్భవతి కాదని ఆమె ఓ మానసిన వ్యాధితో బాధపడుతోందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు, ఆమె వెళ్లే చర్చి పాస్టర్లు కూడా ధృవీకరిస్తున్నారు. ప్రెగ్నెన్సీ టెస్టుల్లో కూడా హాలె గర్భవతి కాదని తేలింది.

Teen Says She’s Pregnant With Baby Jesus

హాలె గర్భవతి కాదని ఆమె చెప్పే మాటలను నమ్మవద్దని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.ఆమె ఓ మానసిక రోగంతో బాధపడుతుందని…గర్భవతిని అని నమ్ముతుందని చెప్పారు. ప్రస్తుతం మానసిక నిపుణులు చికిత్స అందిస్తున్నారని త్వరలోనే హాలె కొలుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అయితే హాలే మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. తాను గర్బవతినని…తాను జీసస్‌కు జన్మనిస్తున్నట్లు వాదిస్తోంది. నా తల్లి దండ్రులు,స్నేహితులు,ఫాస్టర్స్ ఎవరు నమ్మకున్నా తాను మాత్రం గర్భవతినని స్పష్టం చేస్తోంది. తనకు జీసస్ గురించి తెలుసని…నా కుటుంబ సభ్యులు సహా ఎవరు నమ్మకున్న బాధలేదని చెబుతోంది.

Teen Says She’s Pregnant With Baby Jesus

తాను 11 కిలోల బరువు కూడా పెరిగాననీ, ఇప్పుడు తనకు 9వ నెల నడుస్తోందని చెబుతోంది. హాలె కుటుంబసభ్యులు మాత్రం ఆమె పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హాలె మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -