క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్‌..

194
CM KCR
- Advertisement -

ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌ హాజరై క్రిస్టియన్‌ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి, కానుకలు అందజేశారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేశారు. ఇంకా ఈ క్రిస్మస్ వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి ఇతర ప్రముఖులు హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

KCR

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..దేశంలోనే క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. క్రిస్మస్, రంజాన్ వేడుకలను తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ ను నిర్మిస్తం. భగవంతుని దయవల్ల మనం కోరుకున్న రాష్ట్రం సిద్ధించింది. మైనార్టీల సంక్షేమం కోసం రూ.2 వేల కోట్లు కేటాయించాం. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు గొప్ప ఫలితాలు ఇస్తున్నాయి. మంచి మెజార్టీతో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్థికంగా ప్రగతి సాధిస్తోందన్నారు.

- Advertisement -