రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ 21 నుంచి 24 వరకు కోవింద్ హైదరాబాద్లో విడిదిచేయనున్నారు. హైదారాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి సీఎం కేసీఆర్,గవర్నర్ నరసింహన్ ఘనస్వాగతం పలికారు.
ఏటా శీతాకాలంలో హైదరాబాద్లోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి కొద్ది రోజులు గడుపుతారు. అందులో భాగంగా ఈసారి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
శనివారం కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబరు 23న జరిగే ఎట్ హోం కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖలతో భేటీ అయి, వారికి విందు ఇస్తారు. డిసెంబరు 24న తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.