- Advertisement -
ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. క్రిష్-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుండగా సినీ,రాజకీయ నేపథ్యాలను వేర్వేరుగా చూపించనున్నారు క్రిష్. తొలుత జనవరి 9న సినీ నేపథ్యంలో కథానాయకుడు,రాజకీయ నేపథ్యంలో జనవరి 24న మహానాయకుడు విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
అయితే తాజాగా మాహానాయకుడు విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్. ఫిబ్రవరి 7న మహానాయకుడుని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. మొత్తంగా రోజుకో అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ని కొట్టేస్తున్న ఎన్టీఆర్ టీం సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో వేచిచూడాల్సిందే.
- Advertisement -