కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు

259
kcr new districts
- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకానున్నాయి. ములుగు,నారాయణపేట్‌ రెవెన్యూ డివిజన్లుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి ములుగు, నారాయణపేట్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.

నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, ములుగు మండలంలోని మల్లంపల్లె, బాన్సువాడ నియోజకవర్గంలో చండూరు, మోస్రా, మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావు పేట, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలో మరో మండలం కొత్తగా ఏర్పాటు కానున్నాయి.

ఇక ములుగు రెవెన్యూ డివిజన్‌తో ప్రత్యేక జిల్లా, నారాయణపేట్ రెవెన్యూ డివిజన్, కోయిల్‌కొండ మండలంతో నారాయణపేట్ జిల్లా ఏర్పడనుంది. కోరుట్ల, కొల్లాపూర్ కొత్త రెవెన్యూ డివిజన్లుగా మారనున్నాయి. దీంతో పాటు జనగాం జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు గుండాల మండలం బదలాయింపు.. మొత్తంగా వీటికి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని సీసీఎల్‌ఏ కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది.

- Advertisement -