రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని స్పష్టం చేశారు ఎంపీ కవిత. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కవిత మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అన్న కాంగ్రెస్ నేతలు.. ఇవాళ ఓటమికి చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు కుంటిసాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి హామీలను ప్రజలు విశ్వసించలేదని అందుకే టీఆర్ఎస్‌కు పట్టం కట్టారని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని… పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయని తెలిపారు. టీఆర్ఎస్ కీలకంగా మారబోతోందని తెలిపారు.
రోజులు మారినా కానీ.. ఉభయసభల్లో మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందని రాఫెల్ అంశాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసింది కవిత. పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగనీయొద్దని కాంగ్రెస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని కవిత పేర్కొన్నారు.
Same old story !! Different day .. fixed match between BJP & Congress !! https://t.co/8xMlR0PLSv
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 19, 2018