చెర్రీ,బన్నీ పై మోజు పడ్డ..చైతు భామ

230
online news portal
- Advertisement -

అవకాశాల కోసం హీరోయిన్లు,,,స్టార్ హీరోలను కాకపట్టడం..వారిని తెగ పోగిడేయడం సాధరణంగా మనం చూస్తూనే ఉంటాం. ఏదో దయ తలిచి ఓ ఛాన్స్ ఇవ్వకపోడా అని,,ఓ రాయి అలా విసురుతుంటారు. తాజాగా సాహసం శ్వాసగా సాగిపో భామ మంజిర మోహన్ కూడా,,ఇద్దరి టాలీవుడ్‌ హీరోలను పోడిడే పని పెట్టుకుంది. ఆ స్టార్ హీరోలు అంటే తనకు చాలా ఇష్టమని,,వారి సినిమాలు ఎక్కువగా చూస్తానని. వారితో నటించడం ఓ అదృష్టంగా భావిస్తానంటు చెప్పుకొచ్చింది. ఇంతకు ఎవరా టాలీవుడ్‌ స్టార్ హీరోలు అనుకుంటున్నారా,, రామ్ చరణ్. అల్లు అర్జున్ ఆట.

online news portal

సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మంజిర మోహన్‌,,టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది. అందుకే స్టార్ హీరోల దృష్టిలో పడేందుకు,,శతవిధాలా ట్రై చేస్తోంది. మరి ఈ సినిమాతో ఆకట్టుకుని  రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌ ల మెప్పుతుందో లేదో చూడాలి. అమ్మడు కటౌట్ పరంగా చూస్తే చెర్రీ, బన్నీకి కరెక్ట్‌గా మ్యాచ్ ఫిగరే.  దీన్ని బట్టి చూస్తే,,,అమ్మడు ప్లాన్ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు  బాగానే కనబడుతున్నాయి.

online news portal

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తున్న సమంత,,నాగ చైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌ నుంచి పరిచయమైన అమ్మాయే.  ఏ మాయ చేశావే సినిమాతో అందరిన ఏదో మాయ చేసేసింది. స్టార్ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. మళ్లీ వీరి కాంబినేషన్‌తో ఇప్పుడు మంజిర రాబోతోంది.  దీంతో అమ్మడు కూడా టాలీవుడ్‌ ఫ్యూచర్ పై చాలా ఆశలే పెట్టుకుంది. తన కూడా సమంత లా స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని కలలు కంటోంది. అందుకే ఇప్పటి నుంచే అవకాశాల కోసం తన వంతు ప్రయత్నం చేసే పనిలో పడింది. నవంబర్ 11 న రాబోతున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో అమ్మడు జాతకం తెలవనుంది.

 

- Advertisement -