క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా ‘కథానాయకుడు’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ తన డబ్బింగును ప్రారంభించారు.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21న ఎన్టీఆర్ స్వగ్రామమైన పామర్రు మండలం నిమ్మకూరులో ఆడియో వేడుక ఘనంగా జరగనుంది.
ఈ మేరకు బాలకృష్ణ సన్నిహితులు సురేంద్ర, బొర్రా గాంధీ నిమ్మకూరులో పర్యటించి స్థానిక గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణం వేడుకకు అనువైన స్థలంగా గుర్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబీకులు హాజరవుతారని పేర్కొన్నారు.
జనవరి 9న ఎన్టీఆర్ సినీ జీవితం నేపథ్యంలో కథానాయకుడు విడుదలవుతుండగా ఫిబ్రవరిలో రాజకీయ జీవితనేపథ్యంలో మహానాయకుడు విడుదల కానుంది.